మన గ్రామ చరిత్ర
పూర్వం మన గ్రామమైన బొబ్బిలిదేవపురాన్ని(నేటి బొప్పూడి) రాజథానిగా చేసుకొని చొళులు పరిపాలించేవారు. దీనికి కారణం దట్టమైన అడవి మరియు ఎత్తైన కొండ ఉండటంచేత శత్రువులబారి నుండి తప్పించుకొవడానికి మంచి అనువైన ప్రదేశంగా బావించి ఉండవచ్చు.ఈ క్రమంలొ వారు కొండమీద అనువైన ప్రదేశం కొసం వెతుకుతున్నపుడు స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామివారు దర్శనం ఇచ్చినట్లు ప్రతీతి.ఈ విషయాలన్ని చెన్నైలొ ఉన్నటువంటి బ్రౌన్ రాసిన లొకల్ రికార్డ్స్ వ్యాల్యూం 50 లొ 641 నుండి 643 పేజీల వరకు మన ఊరి(బొప్పూడి) చరిత్రను ప్రస్తావించారు. చొళరాజుల పరిపాలన అనంతరం 1700 లొ బొబ్బిలిదేవపురంపై ఔరంగజేబు దండయాత్ర చేసాడు.గ్రామానికి చెందిన భూములను వేలం వేసి ఆలయాలను నిర్లక్ష్యం చేశారు.శ్రీ క్రిష్ణదేవరాయలు మంత్రి అయినటువంటి మాహమంత్రి తిమ్మరుసు అన్న కుమారుడు బొప్పన్న కొండపైన వెలసిన వెంకటేశ్వరస్వామి మరియు గ్రామంలొని చెన్నకేశవస్వామి వార్లకు ఆలయాలను నిర్మించారు.
అనంతరం వారి వారసుడు రాజయ్య దేవాలయాలకు 78 ఎకరాలు భూమిని విరాళంగా అందించారు. ఔరంగజేబు వేసిన వేలంలొ పొలాన్ని కోల్పొయిన వారికి ఉచితంగా భూమిని పంపిణి చేసారు.నాటినుండి బొప్పయ్యకు కృతజ్ఞతగా గ్రామం పేరు బొప్పూడిగా తీర్మానించారు. ఈ క్రమంలొ ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విషయం ఎమనగా బొప్పూడి కొండనుండి కొండవీటికొండకు రహస్యమార్గం ఉందని ఊరిలొని కొందరు పెద్దలు చెప్తున్నారు. గ్రామంలొని చెన్నకెశవస్వామి వారి ఆలయంలొ దూపదీప నైవేద్యాలు అందించేందుకు సూదనపాడు గ్రామంలొ 11 పుట్లు భూమిని అందిస్తూ 1156 నవంబరు 15 తేదీన నన్నెచోళుడు శిలాశాసనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శాసనం నేడు ఆ ఆలయంలోనె మనం చూడవచ్చు.